అలేఖ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి

  •     కలెక్టర్​కు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల వినతి

నిర్మల్, వెలుగు: ఇటీవల ఖానాపూర్​లో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన అలేఖ్య కేసు విచారణ వేగవంతం చేసేందుకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ పలువురు ప్రజా సంఘాల నాయకులు, అలేఖ్య తల్లిదండ్రులు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్​ను కోరారు. మంగళవారం కలెక్టరేట్​లో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రేమో న్మాది ఘాతుకానికి తమ కూతురిని కోల్పోవ డమే కాకుండా కోడలు జయశీల పరిస్థితి సైతం విషమంగా ఉందని అలేఖ్య తల్లిదండ్రులు బోరుమన్నారు. 

చిన్నారి రియాన్స్ కోలుకుంటున్నా డని చెప్పారు. వెంటనే హంతకుడు శ్రీకాంత్, అతడికి సహకరించిన తల్లి, తమ్ముళ్లకు ఉరిశిక్ష వేయాలని వేడుకున్నారు. వారు బయటకు వస్తే తమ కుటుంబానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.కోటి ఎక్స్​గ్రేషియా ప్రకటించి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అఖిలపక్షం నాయకులు  కలెక్టర్​ను కోరారు. నాయకులు నందిరామయ్య, జన్నా రపు శంకర్, గొర్రె గంగాధర్, నిట్ట రవి, నాగేల్లి నర్సయ్య, మురళీకృష్ణ, ప్రణీత్, సతీశ్, రాజు తదితరులున్నారు.