ఈఎస్ఐ హాస్పిటల్స్ ​ఏర్పాటు చేయండి

ఈఎస్ఐ హాస్పిటల్స్ ​ఏర్పాటు చేయండి
  •      ఈఎస్ఐ డైరెక్టర్​జనరల్​కు సింగరేణి సీఎండీ వినతి

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఈఎస్ఐ సేవలు విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈఎస్ఐ  డైరెక్టర్ జనరల్ కమల్ కిశోర్ సోన్​ను సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. శుక్రవారం బలరామ్​ ఢిల్లీలో ఈఎస్ఐ డీజీ కిశోర్​ సోన్​ను కలిశారు.  సింగరేణిలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు కంపెనీ తరఫున వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. 

వారి కుటుంబసభ్యులకు కూడా సేవలందించేలా  కొత్తగూడెం, జైపూర్​ థర్మల్ ప్లాంట్​లో ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు. అందుకు సింగరేణి తరఫున సాయం చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. ఈఎస్ఐ డీజీ కమల్ కిశోర్ సోన్ మాట్లాడుతూ.. ముందు రెండు ఈఎస్ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరం మేరకు ఆసుపత్రులుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.