![హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయండి : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్](https://static.v6velugu.com/uploads/2025/02/set-up-iim-in-hyderabad-says-mp-anil-kumar-yadav-in-letter-to-union-education-minister_Jy1dseE2bw.jpg)
- కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఎంపీ అనిల్ లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్య సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కోరారు. సోమవారం ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు.
హైదరాబాద్ స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు అత్యంత అనుకూలమైన గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ (జీసీసీ)గా కూడా అభివృద్ధి చెందుతోందన్నారు. వ్యాపార అనుకూల విధానాల కారణంగా హైదరాబాద్ అనేక పారిశ్రామిక వెంచర్లకు, వెంచర్ క్యాపిటలిస్టులకు గమ్యస్థానంగా మారిందన్నారు.