ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ గుడ్ బై.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బిగ్ షాక్..

ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ గుడ్ బై.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బిగ్ షాక్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ కు పంపారు గెహ్లాట్. రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు గెహ్లాట్. పార్టీపై ప్రజలకు నమ్మకం పోతోందని అన్నారు. కేంద్రంతో పోరాడటానికి సమయం కేటాయిస్తే.. ఢిల్లీ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు గెహ్లాట్.

ప్రజాసేవలో ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ విఫలమయ్యారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు గెహ్లాట్. పార్టీ తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కుంటోందని అన్నారు. నయా బంగ్లా లాంటి సిగ్గుమాలిన, విచిత్రమైన వివాదాలు చాలానే ఉన్నాయని... మనం ఇంకా సామాన్యులమని నమ్ముతున్నామా అనే సందేహం అందరికీ కలుగుతోందని అన్నారు గెహ్లాట్.

ఆప్ పార్టీని వీడటం తప్ప తనకు వేరే మార్గం లేదని... అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు గెహ్లాట్. కేజీవాల్కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని... మంచి రాజకీయ ప్రయాణానికి తోడ్పాటును అందించిన తన పార్టీ సహచరులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు కైలాష్ గెహ్లాట్.