మేడారంలో కంట్రోల్‌‌ రూమ్‌‌ ఏర్పాటు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌‌ రూమ్‌‌ను శుక్రవారం కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ శ్రీజ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 1800 -425 -0620 టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌కు ఫోన్‌‌ చేయాలని, ఈ నంబర్‌‌ 19వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందన్నారు.

జాతర ప్రాంతంలో మొత్తం 382 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మూడు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌‌ టీమ్స్‌‌ అందుబాటులో ఉంటాయన్నారు. అడిషనల్‌‌ కలెక్టర్‌‌ వేణుగోపాల్‌‌, ఈ డిస్ట్రిక్ట్‌‌ మేనేజర్‌‌ దేవేందర్ పాల్గొన్నారు.