- వచ్చే నెలలో ‘మధురానగర్’లో ప్రారంభించనున్న సీఎం
- తర్వాత నాలుగు స్టేషన్లలో ఓపెనింగ్
- ఓపెన్ లైబ్రరీస్ పేరుతో హెచ్‌పీఎస్ స్టూడెంట్
- ఆకర్షణ వినూత్న ప్రయోగం
హైదరాబాద్ సిటీ, వెలుగు:వివిధ కార్యక్రమాలతో వినోదాన్ని అందిస్తున్న మెట్రో..త్వరలో ఓ బాలికతో కలిసి మెట్రోస్టేషన్లలో లైబ్రరీలు ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే నిమ్స్, ఇతర ప్రాంతాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసిన హెచ్పీఎస్స్టూడెంట్ ఆకర్షణ సతీశ్..మెట్రోతో కలిసి ‘ఓపెన్ లైబ్రరీస్’ పేరిట కొత్త ఆలోచనకు తెర తీసింది.
ఇందులో భాగంగా మొదటగా వచ్చే నెలలో మధురానగర్ మెట్రో స్టేషన్లో లైబ్రరీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీని వెంటనే భరత్ నగర్, ఉప్పల్ స్టేడియం, బేగంపేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టేషన్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని ఆకర్షణ చెప్పారు. మెల్లిగా మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ఓపెన్లైబ్రరీలు ఏర్పాటు చేయాలనే ప్లాన్‌తో ఉన్నట్టు ప్రకటించారు.
ఓపెన్ లైబ్రరీస్ యాప్..
మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే ఒక్కో లైబ్రరీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు కలిపి మొత్తం వెయ్యి బుక్స్ అందుబాటులో ఉంచనున్నట్టు ఆకర్షణ తెలిపారు. లైబ్రరీల నిర్వహణకు ‘ఓపెన్ లైబ్రరీస్’ పేరుతో యాప్ కూడా తీసుకురాబోతున్నామన్నారు. మెట్రో ప్రయాణికులు ఈ యాప్‌లో పేరు, ఫోన్ నంబర్ ఎంట్రీ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏ స్టేషన్ లో, ఏ బుక్ తీసుకుంటున్నారో ఆ యాప్ లో ఎంటర్ చేయాలి. తిరిగి ఏ స్టేషన్లో ఉన్న లైబ్రరీలో అయినా బుక్ ను తిరిగి ఇవ్వొచ్చు.
19 లైబ్రరీల ‘ఆకర్షణ’
హైదరాబాద్పబ్లిక్స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ ఇప్పటికే నిమ్స్, ఎమ్ఎన్జే హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, గవర్నమెంట్ స్కూల్స్, పోలీస్ స్టేషన్లు, భరోసా సెంటర్లతో సహా మొత్తం19 చోట్ల లైబ్రరీలు ఏర్పాటు చేసింది. ఇందులో 13,500 బుక్స్‌ను అందుబాటులో ఉంచారు. చిన్న వయసులోనే గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ఆకర్షణను పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పీఎం మన్‌కీ బాత్ లో ఆకర్షణ చేస్తున్న పనిని మోదీ ప్రస్తావించారు. రాష్ట్రపతి, సీఎం, పీఎం నుంచి ఆకర్షణ ఎన్నో ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 25వ లైబ్రరీ ప్రారంభానికి పీఎం మోదీ వస్తానని హామీ ఇచ్చారని ఆకర్షణ చెప్పారు.
1,800 పుస్తకాలతో నిమ్స్‌లో ఆకర్షణ లైబ్రరీ
పంజాగుట్ట నిమ్స్ లోని రేడియాలజీ అంకాలజీ విభాగంలో 1,800 పుస్తకాలతో హెచ్పీఎస్స్టూడెంట్ఆకర్షణ ఏర్పాటు చేసిన లైబ్రరీని సిటీ సీపీ సీవీ ఆనంద్, నిమ్స్డైరెక్టర్డాక్టర్బీరప్ప మంగళవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. తను చదువుతూనే అందర్నీ చదివించేలా ఆకర్షణ లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎవరైనా పుస్తకాలు డొనేట్చేయాలనుకుంటే ఆకర్షణకు ఇవ్వాలని సూచించారు. క్యాన్సర్పేషెంట్లకు ఉపయోగపడేలా తాను సేకరించిన, కొనుగోలు చేసిన పుస్తకాలతో నిమ్స్‌లో లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు ఆకర్షణ తెలిపింది. కాగా ఇప్పటివరకు ఆకర్షణ సిటీలోని వేర్వేరుచోట్ల 18 లైబ్రరీలు ఏర్పాటు చేసింది. ఇది 19వ లైబ్రరీ. కార్యక్రమంలో రేడియేషన్ అంకాలజీ విభాగం హెడ్ డాక్టర్ మోనిక, డాక్టర్లు పాల్గొన్నారు.
జర్నీలో టైమ్ వేస్ట్ చేయకుండా..
మెట్రో ప్రయాణం సందర్భంగా చాలామంది ప్యాసింజర్స్‌ను అబ్జర్వ్చేశా. దాదాపు అందరూ రీల్స్, సినిమాలు చూస్తూనే కనిపించారు. అందుకే వారి టైం వేస్ట కాకుండా, నాలెడ్జ్ ఇంప్రూవ్అయ్యేలా బుక్స్ చదివించాలని అనుకున్నా. మెట్రో లైబ్రరీల్లో అన్ని వర్గాల వారికి బుక్స్అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల దగ్గర ఓల్డ్ బుక్స్ ఏమైనా ఉంటే డొనేట్ చేయొచ్చు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన లైబ్రరీలకు మా నాన్న సతీశ్‌తో పాటు సీనియర్లైబ్రేరియన్ప్రఫుల్ చంద్ర, జి.చంద్రశేఖర్ రావు ఎంతో కోపరేట్చేశారు.