రోడ్లు.. ట్రాఫిక్.. పొల్యూషన్​.. ఇవే మేజర్ ప్రాబమ్స్

రోడ్లు.. ట్రాఫిక్.. పొల్యూషన్​.. ఇవే మేజర్ ప్రాబమ్స్

రోడ్లు సక్కగ లేవు.. ట్రాఫిక్.. పొల్యూషన్​

మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే అంటున్న సెటిలర్స్

“మాది గుజరాత్. 10 ఏళ్ల క్రితం సిటీకి వచ్చి సెటిలయ్యాం.  ఎంఎస్ మక్తా సమీపంలో ఉంటున్నం. సిటీలో పదేళ్లలో చూసిన మార్పు మాత్రం కొంతే. మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన పనులే ఎక్కువ. మేం ఉంటున్నప్పటి నుంచి రోడ్స్ అలాగే ఉన్నయ్. మాములు రోజుల్లో అందంగా కనిపించే సిటీ వర్షాలొస్తే  భయపెడుతుంది. మా ఏరియాలో కుక్కల బెడద చాలా ఎక్కువ. ఎన్నిసార్లు బల్దియా అధికారులకు కంప్లయింట్​చేసినా నో రెస్పాన్స్​.  డ్రైనేజీ వల్ల సఫర్ అవుతున్నం. చెప్పినా కానీ నాయకులు వచ్చింది చూసింది లేదు. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎవరూ రారు, పట్టించుకోరు. ఇంప్రూవ్ , సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్​చాలా ఉన్నయ్​.” ఓ సెటిలర్​ ఓపీనియన్​ ఇది.

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఉంటున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెంది న వారు కూడా ఎక్కువే. దాదాపు 20 నుంచి 25శాతం వీరే ఉంటారు.  ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చారు.  ఓటర్, ఆధార్ అన్ని ఉండి హైదరాబాదీలు అయిపోయారు. సిటీలో డెవలప్​మెంట్​ఎలా ఉంది? ఎలాంటి ప్రాబ్లమ్స్​ ఫేస్​ చేస్తున్నారు?  కార్పొరేటర్లు పట్టించుకుంటున్నారా? ట్రాఫిక్, పొల్యుషన్, సర్కార్​ హాస్పిటల్స్ ఇలా వివిధ అంశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

కరోనా టైంలో ..

కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే సరైన ఫెసిలిటీస్ లేవని, ప్రైవేటు హాస్పిటల్స్ లో బెడ్స్ ఖాళీ లేవన్నారు.  కనీసం పట్టించుకున్న వారే లేరని, హాస్పిటల్స్ లో క్విక్ రెస్పాన్స్ కూడా లేదని  చెప్పారు. “ చెన్నైలో కరోనా టైంలో అక్కడి గవర్నమెంట్ చాలా బాగా పనిచేసింది. ఎప్పటికప్పుడు ప్రజల హెల్త్ ​గురించి ఆరా తీసింది. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని కూడా డాక్టర్స్ కన్సల్ట్ అయ్యేవారు. వారి గురించి తెలుసుకునేవారు. అది ఇక్కడ కనిపించలేదు.’’ అని తమిళనాడుకు చెందిన వాసుదేవన్ చెప్పారు. జనాలకు కనీస వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాలంటే..

ఇరుకు రోడ్లు, గుంతలు, మ్యాన్ హోల్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అత్తాపూర్ లో ఉండే ఓ సెటిలర్ తను పనిచేసేది బంజారాహిల్స్ లో  వర్షం పడుతుందంటే ఆ టైంలో బైక్ వేసుకుని ఇంటికి వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానన్నారు. చాలా యాక్సిడెంట్ తన కళ్లముందే అయ్యాయన్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, గుంత ఉందో తెలియక వానాకాలంలో  ప్రాబ్లమ్ వస్తున్నాయని చెబుతున్నారు. ఇక వర్షాలప్పుడే కాకుండా మాములు రోజుల్లో కూడా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నిసార్లు కంప్లయింటు చేసినా సాల్వ్ చేయడం లేదన్నారు.

గ్రీనరీ తక్కువగా ఉంది

మాది ఒడిశా. సిటీకి వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. ఇక్కడ ట్రాఫిక్, పొల్యూషన్  రోడ్లు ఇవే మేజర్ ప్రాబ్లమ్స్. రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే. డ్రైనేజీ సరిగా సిస్టం లేదు.  భువనేశ్వర్​లో రోడ్లు చాలా విశాలం గా ఉంటాయి.   వేరే సిటీలతో పోలిస్తే ఇక్కడ గ్రీనరీ తక్కువ. చెట్లు పెంచాలి.

-చంద్రశేఖర్ పట్నాయక్, అత్తాపూర్

ఫెసిలిటీస్ కల్పించాలె

మాది తమిళనాడు. సిటీకి వచ్చి 30 ఏళ్లు. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ, పొల్యూషన్ ప్రాబ్లమ్ ఉంది.  మా ఏరి యా కార్పొరేటర్​ వచ్చి ప్రాబ్లమ్స్​ ఏంటని కూడా తెలుసుకోలేదు.  ఇక్కడ ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్, సర్వీస్ మెరుగుపడాలి.

-జయశ్రీ, సోమాజిగూడ

For More News..

బీజేపీ క్యాండిడేట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి!

ఎల్​ఆర్​ఎస్​ స్పీడ్​.. గ్రేటర్​ ప్రజలపైనే రూ. 2 వేల కోట్లకుపైగా భారం

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌.. అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లి హత్య?