లాగోస్ (నైజీరియా) : ఐవరీ కోస్ట్ క్రికెట్ జట్టు ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యల్ప స్కోరుతో చెత్త రికార్డు సృష్టించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ గ్రూప్–సిలో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏడు పరుగులకే ఆలౌటైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 20 ఓవర్లలో 271/4 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ఐవరీ కోస్ట్ టీమ్ 7.30 ఓవర్లలో ఏడు రన్స్‌కే కుప్పకూలింది.
రెండు నెలల కిందట సింగపూర్‌తో మ్యాచ్‌లో మంగోలియా, గతేడాది స్పెయిన్‌తో పోరులో ఐల్ ఆఫ్ మ్యాన్ 10 రన్స్‌కే ఆలౌటైన రికార్డును బ్రేక్ చేసింది. మెన్స్ క్రికెట్‌లో ఒక జట్టు సింగిల్ డిజిట్ స్కోరు చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు 264 రన్స్ తేడాతో గెలిచిన నైజీరియా ఈ ఫార్మాట్‌లో మూడో అది పెద్ద విజయం సొంతం చేసుకుంది.