కుంభమేళాకు వెళ్లొస్తూ.. ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి

కుంభమేళాకు వెళ్లొస్తూ.. ఏడుగురు హైదరాబాద్ వాసులు  మృతి

కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తూ ఏడుగురు హైదరాబాద్ వాసులు  మృతి చెందారు.. మంగళవారం ( ఫిబ్రవరి 11, 2025 ) ప్రయాగ్ రాజ్ నుండి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. కుంభమేళాకు వెళ్లిన హైదరాబాద్ వాసులు కొంతమంది తిరుగు ప్రయాణంలో ఉండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ దగ్గర మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో హైవే మీద ట్రక్కు రాంగ్‌ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా..  మరికొందరు తీవ్ర గాయాలతో మినీ బస్సులో చిక్కుకుపోయినట్లు సమాచారం.

ALSO READ | వివేకా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసులు

ప్రమాదం గురించి స్థానికులు సమాచారం అందించటంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ లోని నాచారం వాసులేనని  తెలిపారు పోలీసులు. ఘటనకు సంబంధించి ఇతర తెలియాల్సి ఉంది