హైదరాబాద్ లోని మోష్ పబ్‌లో కస్టమర్లను మోసం చేస్తున్న ఎనమిది మందిని మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది స్మార్ట్ ఫోన్లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్స్‌తో వ్యాపారులకు, విద్యార్దులకు వల వేస్తు్న్నట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా ఈ అక్రమ దందా కొనసాగుతుంది. వ్యాపారులను, విద్యార్దులను పబ్‌కి వచ్చేలా చేసి ఖరీదైన మద్యం తాగించి వారికి లక్షల రూపాయల డబ్బును టోకరా వేస్తున్నారు. పబ్ ప్రతినిధులతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ ను చేధించినట్లుగా మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా గ్రూపుగా ఏర్పడి ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా వెల్లడించారు. నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్స్ లో ఫొటోస్ పెట్టి చాట్ చేస్తారని తెలిపారు. అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గర్లోని పబ్స్ కు తీసుకు వెళ్తారని ఆ తర్వాత వీరికి ఆయా పబ్స్ లో సపరేట్ క్యూ ఆర్ కోడ్ మెషిన్, సపరేట్ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారని తెలిపారు.
డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ అమ్మాయితో వచ్చిన కస్టమర్ కి ఇస్తారు. అమ్మాయిలకు, 10 ml కస్టమర్ కు 30 ml ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. బిల్లింగ్ సమయానికి అమ్మాయి చీట్ చేసి పారిపోతుంది. ఎక్కువ బిల్లు వేసి.. ఆ మొత్తాన్ని ఈ గ్రూపు, అమ్మాయి, పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారు. దాదాపుగా నలభై రోజుల్లో రూ. 40 లక్షల వరకు మోసం చేశారని డీసీపీ వినీత్ వెల్లడించారు. ఈ గ్యాంగ్ నెల రోజుల తరువాత మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుందని.. హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ లో సైతం ఇలా చేయబోతుంటే పట్టుకున్నామని వెల్లడించారు.