యాదాద్రిని చుట్టేసిన యువ ఐఏఎస్​లు

ఐఏఎస్​–2023 బ్యాచ్​ తెలంగాణ క్యాడర్​కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ కలెక్టర్లు యాదాద్రి జిల్లాను చుట్టేశారు. తెలంగాణ దర్శినిలో భాగంగా జిల్లాలోని పలు దర్శనీయ స్థలాలను మంగళవారం సందర్శించారు.  తొలుత భువనగిరి కోటను సందర్శించి విశేషాలను టూరిజం గైడ్​ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు.

ఆలేరు మండలం కొలనుపాకలోని జైన దేవాలయం, శ్రీ సోమేశ్వరాలయం, మ్యూజియానికి వెళ్లారు. వీరిలో అసిస్టెంట్​ కలెక్టర్లు​ ఉమా హారతి, అజ్మేరా సంకేత్ కుమార్, గరిమా నరుల, అభిజ్ఞాన్ మాలవీయ, అజయ్ యాదవ్, మృణాల్ శ్రేష్ట, ఐఈఎస్​ ఎస్​డీ మనోజ్​ ఉన్నారు. ‌‌‌‌

 - యాదాద్రి, వెలుగు