- అడిషనల్ కలెక్టర్‌కు అవిశ్వాస నోటీస్
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 కౌన్సిలర్లు ఉండగా, బీఆర్ఎస్‌కు 11, కాంగ్రెస్‌కు ఇద్దరు ఉన్నారు. గురువారం ఏడుగురు కౌన్సిలర్లు హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం పెద్దపల్లి అడిషనల్కలెక్టర్ అరుణశ్రీకి అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో వెనుకబడిందని, మంథని అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు.
Also read :- మల్కాజిగిరి ఎంపీ సీటుకు బండ్ల గణేష్ దరఖాస్తు
కాగా కొంతకాలంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై అవిశ్వాసం పెట్టేందుకు పలువురు జడ్పీటీసీలు ప్రయత్నిస్తున్నారు. పదవిని కాపాడుకునేందుకు చైర్మన్ మధుతోపాటు బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. జడ్పీటీసీలను బుజ్జగిస్తున్నారు. ఇదిలాఉండగానే ఊహించని విధంగా మంథని మున్సిపాలిటీ అవిశ్వాసం తెరమీదకు రావడంతో మంథని రాజకీయాలు వేడెక్కాయి. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో
పడిపోయింది.