
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత పొరుగు దేశాలతోపాటు హిందూ మహా సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ఏడుగురు ముఖ్య నేతలు హాజరయ్యారు. వీరంతా ఢిల్లీకి చేరుకోగా, ప్రముఖ హోటల్స్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ వీరికి బస ఏర్పాటు చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, శ్రీలంక ప్రెసిడెంట్రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్కుమార్జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా, సీషెల్స్ఉపాధ్యక్షుడు అహ్మద్అఫీఫ్కార్యక్రమానకి హాజరైన వారిలో ఉన్నారు. కాగా, ఇందులో మాల్దీవ్స్ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు తొలిసారి ఇండియాకు విచ్చేశారు. మయిజ్జుకు చైనా అనుకూలిడిగా పేరుంది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇండియాతో అంటీముంటనట్టు వ్యవహరించారు.
మాల్దీవులను విడిచిపోవాలని భారత్ బలగాలకు షరతు విధించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారానికి మయిజ్జు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. భారత్‌తో సన్నిహిత సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకునే దిశగా ప్రధాని మోదీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా మయిజ్జు తెలిపారు. తన పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశలో సాగుతున్నాయనే సందేశం నిరూపితమవుతుందని పేర్కొన్నారు.