కేంద్రం కరోనా కేసులను బట్టి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలను రెడ్ జోన్లుగా, 19 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వరుసగా 14 రోజులు కేసులు నమోదవకపోతే రెడ్ జోన్ నుంచి ఆరేంజ్ జోన్‌లోకి, ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి వస్తాయని కూడా పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలో 14 రోజులుగా కేసులు నమోదుకాని ఏడు ఆరెంజ్ జోన్ జిల్లాలు ఇప్పుడు గ్రీన్ జోన్‌లోకి వెళ్లాయి. ఈ లిస్టులో కొత్తగూడెం, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ , ములుగు, జనగామ, పెద్ద పల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నయి. వనపర్తి, వరంగల్ రూరల్, భువనగిరి జిల్లాల్లో మొత్తంగా ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక ఆరెంజ్ జోన్‌లో ఉన్న వరంగల్ అర్బన్, భూపాలపల్లి, సంగారెడ్డి, ఖమ్మం, నిర్మల్, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో గత వారం రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. మరోవారం ఇలాగే కొనసాగితే ఈ ఎనిమిది జిల్లాలు కూడా గ్రీన్ జోన్‌లోకి వెళ్తాయి.
For More News..