లేడీ డ్రింకర్స్: ఈ రాష్ట్రాల్లో ఆడోళ్లు తెగ తాగేస్తున్నారు

లేడీ డ్రింకర్స్: ఈ రాష్ట్రాల్లో ఆడోళ్లు తెగ తాగేస్తున్నారు

మద్యం మగవాళ్లే ఎక్కువగా తాగుతారు..ఆడవాళ్లతో తాగేవారు చాలా తక్కువ అని అనుకుంటారు తెలియనివాళ్లు..ఇటీవల నివేదికలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయా లను బయటపెట్టాయి. అవేంటంటే..మన దేశ జనాభాలో దాదాపు 13 శాతం మంది  మద్యం సేవిస్తున్నారట.. అందులో కొన్ని రాష్ట్రాల్లో స్త్రీలు అత్యధికంగా మద్యం తాగుతున్నారని తాజా రిపోర్టు చెబుతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం 2019 , 2021 మధ్యలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించింది. ఇందులో స్త్రీలు అత్యధికంగా మద్యం సేవించే ఏడు రాష్ట్రాలను గుర్తించింది.

మనదేశంలో స్త్రీలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రాలు 

అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా మద్యం సేవించే మహిళలున్న రాష్ట్రం... ఈ రాష్ట్రంలో విక్రయించబడే మొత్తం మద్యం 24.6 శాతం మద్యాన్ని మహిళల తాగుతారట.

సిక్కింలో కూడా మహిళలు మద్యాన్ని మంచినీళ్లలా తాగుతున్నారు.. దాదాపు 16.2 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. 

అసోంలో మొత్తం మద్యం వినియోగ దారుల్లో 7.3 శాతం మంది మహిళలే

తెలంగాణలో 6.7 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు 

జార్ఖండ్ లో దాదాపు 6.1 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. 

అండమాన్ నికోబార్ దీవులలో 5శాతం మంది మహిళలు ఆల్కహాల్ తాగుతారట

ఛత్తీస్ గఢ్ లో 4.9 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో తేలింది.