లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మధుర–బరేలీ హైవేపై జైత్‌పూర్ గ్రామ సమీపంలో ప్యాసింజర్లతో వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లోని ఏడుగురు ప్రయాణికులు చనిపోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యాన్ హాథ్రస్‌లోని కుమారై గ్రామం నుంచి ఎటాలోని నాగ్లా ఇమాలియా గ్రామానికి వెళ్తుందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జైత్‌పూర్ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు.