పతంగుల పంచాదిలో ఏడుగురు అరెస్ట్

తూప్రాన్, వెలుగు: సంక్రాంతి సందర్భంగా  పతంగుల షాపు వద్ద తల్వార్లతో హల్ చల్ చేసిన ఘటనలో ఏడుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎస్ఐ శివానందం తెలిపిన ప్రకారం.. తూప్రాన్ కు చెందిన తుమ్మల గణేశ్, కేశవ్ నగర్ కాలనీలో పతంగుల షాప్​ నిర్వహిస్తున్నాడు. మంగళవారం పతంగులు కొనేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు  వచ్చి గణేశ్ తో గొడవపడ్డారు.  మరికొందరిని పిలిచి తల్వార్లతో గణేశ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులపై దాడికి ప్రయత్నించారు. దీంతో తప్పించుకోగా ఇంటి తలుపులు, షాపులోని సామగ్రిని ధ్వంసం చేశారు. బాధితుడు గణేశ్ ఫిర్యాదు మేరకు నిందితులు జగదీశ్ సింగ్, అమర్ దీప్ సింగ్, తుపాన్ సింగ్, గోవింద్ సింగ్, బలరాం సింగ్, బల్జిత్ సింగ్, తోపాన్ సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని ఎస్ఐ చెప్పారు.