మూడో రోజు ఏడు నామినేషన్లు

మూడో రోజు ఏడు నామినేషన్లు

కరీంనగర్‌‌ టౌన్‌‌/నల్గొండ, వెలుగు : గ్రాడ్యుయేట్‌‌, టీచర్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మూడో రోజైన బుధవారం మొత్తం ఏడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌‌ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మూడు సెట్లు, టీచర్స్‌‌ ఎమ్మెల్సీ కోసం ఒక నామినేషన్‌‌ వచ్చింది. ఇదివరకే నామినేషన్‌‌ వేసిన సిలివేరి శ్రీకాంత్‌‌ గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌‌ ఎన్నికకు మరో సెట్‌‌ వేశారు. 

పిడిశెట్టి రాజు సైతం గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీకి మరో సెట్‌‌ నామినేషన్‌‌ సమర్పించారు. అలాగే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్‌‌ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ కోసం నామినేషన్‌‌ వేశారు. ఇప్పటివరకు మొత్తం 13 మంది 20 నామినేషన్లు వేయగా, గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ కోసం 9 మంది 13 సెట్లు, టీచర్స్‌‌ ఎమ్మెల్సీ కోసం ఐదుగురు ఏడు సెట్ల నామినేషన్లు వేశారు. అలాగే వరంగల్‌‌, -ఖమ్మం-, నల్గొండ టీచర్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం మూడు నామినేషన్లు వచ్చాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌‌కు చెందిన బంకరాజు రెండు సెట్లు, నల్గొండకు చెందిన పన్నాల గోపాల్‌‌రెడ్డి ఒక సెట్‌‌ దాఖలు చేశారు.