తెలంగాణలో కొత్తగా ఏడు పంచాయతీల ఏర్పాటు

తెలంగాణలో కొత్తగా ఏడు పంచాయతీల ఏర్పాటు

మెదక్, (పెద్దశంకరంపేట), వెలుగు :  నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా ఏడు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద శంకరంపేట మండలంలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీ నుంచి గట్టు కింది తండాను, నారాయణఖేడ్ మండలం కొండాపూర్ నుంచి హనుమాన్ మదిర తండా, మాద్వార్ నుంచి లింగనాయక్ పల్లి, నమ్లిమేట్ నుంచి గుండు తండా, సిర్గాపూర్ మండలంలోని అంతర్గావ్ నుంచి  పాత్యా నాయక్ తండా, నాగల్​గిద్ద మండలంలోని ఇరాక్ పల్లి నుంచి ఉమ్లా తండా, నాగల్​గిద్ద నుంచి శామా నాయక్ తండాను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

ప్రతిపాదనలు

కౌడిపల్లి, వెలుగు : కౌడిపల్లి మండలంలో కొత్తగా 11 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా చిలప్​చెడ్​ మండలం నుంచి అంతారం గ్రామాన్ని కౌడిపల్లిలో కలిపారు. దీంతో 30 గ్రామ పంచాయతీలు అయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటితో కలిపి 42 చేరే అవకాశం ఉందని మండల పరిషత్ అధికారులు చెబుతున్నారు.

భుజిరంపేట నుంచి వెంకటాపూర్ (బి), రాయిలాపూర్​ నుంచి దేవులతండా, కొత్తచెరువు నుంచి మహమ్మద్ నగర్ గేట్ తండా, ముట్రాజ్ పల్లి నుంచి  సింగమర్రి తండా, తాళ్లగడ్డ తండా, కొట్టాల గ్రామపంచాయతీ నుంచి లింగంపల్లి, మహమ్మద్ నగర్ నుంచి కన్నారం, హరిచంద్ తండా గ్రామపంచాయతీ నుంచి దేవులతండా, దేవులపల్లి నుంచి కోమటికుంట తండా, సదాశివ పల్లి నుంచి పాంపల్లి, సలాబత్ పూర్ నుంచి కొత్తపల్లిని గ్రామపంచాయతీలుగా ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.