కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

హర్యానా రాష్ట్రంలో ఘోర విషాధం. దసరా పండుగ రోజు బాబా రాజ్ పురి మేళా ఘటన జరుగుతుంది. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు డీగ్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు.. ఓ వాహనంలో బయలుదేరారు. కైతాల్ అనే ప్రాంతానికి వారి కారు వచ్చిన తర్వాత.. డ్రైవర్ అదుపు తప్పి కారును కాలువలోకి తీసుకెళ్లారు. అప్పటికే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఉధృతంగా ఉంది. 

కారు కాలువలోకి దూసుకెళ్లటంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. డ్రైవర్, మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. 12 ఏళ్ల కోమల్ అనే చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు చనిపోవటం మరింత విషాధాన్ని నింపింది. డీగ్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవటంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ALSO READ :  జాగ్రత్త : కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు

ప్రమాదంపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చనిపోయిన వారిని వారి వారి గ్రామాలకు తరలిస్తామని.. ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ.