ఖాకీల్లోనే కంత్రీలు:SP ఫోన్ లొకేషన్ ట్రాక్..ఏడుగురు పోలీసులు సస్పెండ్

ఖాకీల్లోనే కంత్రీలు:SP ఫోన్ లొకేషన్ ట్రాక్..ఏడుగురు పోలీసులు సస్పెండ్

జైపూర్: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా SP  ఫోన్ లోకేషన్నే ట్రాక్ చేశారు. చేసింది పోకిరీలు, ఫ్రాడ్ స్టర్లు అనుకుంటే పొరపాటే.. పక్కా పోలీస్ అధికారులు. విషయం తెలుసుకున్న పోలీస్ బాస్..SP లోకేషన్ ట్రాకింగ్ పాల్పడిన సబ్ ఇన్ స్పెక్టర్ తో సహా ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసిన సంఘటన రాజస్థాన్ లోని భీవాండీలో జరిగింది. 

భీవాండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(SP) జ్యేష్ఠ మైత్రేయి లోకేషన్ ట్రాక్ చేసిన ఘటనలో సైబర్ సెల్ సబ్ ఇన్ స్పెక్టర్ తో సహా ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఎవరు SP లోకేషన్ ట్రాక్ చేయమన్నారు.. ఎందుకు చేయమన్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

అక్టోబర్ 6న  SPజ్యేష్ఠ మైత్రేయి మొబైల్ ఫోన్ ను ట్రాక్ చేస్తున్నట్లు గుర్తించారు. గత కొన్ని వారాలుగా ఆమె ఫోన్ ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే లోకేషన్ ట్రాక్ కు సంబంధించిన నిందితులు తన టీంలోనే ఉన్నట్లు పోలీస్ హెడ్ ఆఫీసులో అధికారికంగా ఫిర్యాదు చేశారు జ్యేష్ఠ మైత్రేయి. 

Also Read : మధ్యప్రదేశ్లో రైలు పట్టాలపై ఐరన్ ఫ్రేమ్

విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు.. సైబర్ సెల్ సబ్ ఇన్ స్పెక్టర్ శ్రవణ్  జోషితోపాటు హెడ్ కానిస్టేబుల్ అశ్నీష్ కుమార్, కానిస్టేబుళ్లు రాముల్, సతీష్, దీపక్,భీమ్, రోహితాష్ లను సస్పెండ్ చేశారు.