
కొండపాక, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఏడు నెమళ్లు చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామంలోని చెరువు వద్ద నెమళ్లు పడిపోయి ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కల రైతులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే ఆరు నెమళ్లు చనిపోయాయి. మరో నెమలిని ఆక్సిజన్ పార్క్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేస్తుండగా చనిపోయింది.
చెరువు చుట్టుపక్కల పొల్లాల్లో వేసిన గుళికలు తిని నెమళ్లు చనిపోయి ఉండవచ్చని దుద్దెడ వెటర్నరీ డాక్టర్ మౌనిక చెప్పారు. నెమళ్లను ఆక్సిజన్ పార్క్‌లో ఖననం చేశామని, రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మృతికి కారణం తెలుస్తుందని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లింగమూర్తి చెప్పారు.