నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వారికి శిక్షణ ఆర్డర్లను అందించి ఆయన మాట్లాడారు. సంస్థ ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్మెంట్
స్టోరేజ్, కాంటాక్ట్స్ వంటి వాటితోపాటు ఇతర విభాగాల గురించి సమగ్ర అవగాహన పొందేవిధంగా నూతన బ్యాచ్ కు రెండు వారాలపాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ ప్రసాద్, ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధి సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.