ఖమ్మం టౌన్/కుసుమంచి, వెలుగు: టెన్త్ ఎగ్జామ్‌లో మాల్ ప్రాక్టీస్‌కు యత్నించిన ఏడుగురిపై కేసు నమోదైంది. కూసుమంచి ఎస్సై కిరణ్‌కుమార్ వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసుమంచి జడ్పీహెచ్ఎస్‌లో మార్చి 23న పరీక్ష రాస్తున్న కొందరు విద్యార్థులకు వారి బంధువులు స్లిప్‌లు అందించేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆదివారం సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ వెంకటరెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో బికారితండాకు చెందిన తేజావత్ రిషి అరవింద్ (విద్యార్థి), బోటిమీదితండాకు చెందిన బానోత్ మంగూలాల్, పోచారానికి చెందిన రెడ్డిమల్ల గణేశ్(విద్యార్థి), కూసుమంచికి చెందిన ఎండీ ఇంతియాజ్, హర్షద్, కొక్కిరేణి సీతారాములు, మరో మైనర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.