తొగుట, రాయపోల్, వెలుగు : గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్చేసి వారి దగ్గరి నుంచి 825 గ్రాముల గంజాయి, 5 బైక్ లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లతీఫ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం రాయపోల్ ఎస్ఐ సిబ్బందితో అనాజిపుర్ కొత్తపల్లి ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఐదు బైక్లపై ఏగుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.
పట్టుకొని విచారించగా బ్యాగరి స్వామి (21) భద్రాచలం దగ్గరలోని కందిగూడెం నుంచి కిలోగంజాయి తెచ్చి కోనేరు మహేశ్, గొల్ల రాజు, బాకీ రాజు, పంజాల అనిల్, దేవుడి కృష్ణమూర్తి, క్యమిద్రి వంశీకి సమానంగా పంచాడు. పది గ్రాముల గంజాయి రూ.300 లకు అమ్మడానికి వెళ్లే సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వీరందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.