కలుషిత నీరు తాగి..15 నిమిషాల్లోనే ఏడు గొర్రెలు మృతి

కలుషిత నీరు తాగి..15 నిమిషాల్లోనే  ఏడు గొర్రెలు మృతి

చేవెళ్ల: బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో.. ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామ శివార్లలో శుక్రవారం (2024, సెప్టెంబర్ 13న )సాయంత్రం జరిగింది.

 పావని లైన్స్(ట్రాన్స్ ఫోర్ట్)కంపనీ లప్పం ఫ్యాక్టరీకి ఎదురుగా ఉంది. ఇక్కడ భారీ ట్రక్కులకు గ్రీజ్, ఫంక్షర్లు, డెఫాయిల్  నింపుతారు. అయితే ట్రక్కుల్లో డిఫాయిల్ నింపే క్రమంలో లీకై ఆ ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉన్న గోతుల్లోకి పారింది. డెఫాయిల్ గోతిలో నీటితో కలుషితం ఐయింది. 

సంచారం చేస్తూ అటుగా వస్తున్న గొర్రెల మంద ఆ గోతి వైపు వెళ్లి నిల్వ ఐన కలుషిత నీటిని త్రాగాయి. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే 7 గొర్రెలు కాళ్ళు కొట్టుకుని మృత్యువాత పడ్డాయి. 

గొర్రెల కాపరులు నారాయణ పేట జిల్లా బండగొండ గ్రామానికి చెందిన వారు. గొర్రెలను మేపుకుంటు వీరు సంచార జీవితం గడుపుతారు.