హెచ్​సీయూలో కూలిన అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్ ​ఫోర్టికో

 హెచ్​సీయూలో కూలిన అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్ ​ఫోర్టికో
  • ఏడుగురు కార్మికులకు గాయాలు..
  • హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్​సెంట్రల్​యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ శ్లాబ్​కుప్పకూలింది. ఇటీవల వర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్​బిల్డింగ్​ఫోర్టికో​నిర్మాణం చేపట్టారు. పనుల్లో భాగంగా పిల్లర్లపై కాంక్రీట్ శ్లాబ్ నిర్మించారు. అయితే సపోర్టు పిల్లర్లు శ్లాబ్ బరువును తట్టుకోలేక గురువారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది.

నిర్మాణ శిథిలాల కింద సంజయ్, కరణ్, ఈశ్వర్, ధీన, యూనస్, మాధవ్, మనోజ్​అనే ఏడుగురు కార్మికులు చిక్కుకోగా, గచ్చిబౌలి పోలీసులు వర్సిటీ అధికారులతో కలిసి వారిని బయటకు తీశారు. నల్లగండ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడం వలన కూలిపోయిందా? లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు.