మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి బోరుబావిలో పడగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దామోహ్ జిల్లాలోని బర్కేడా గ్రామానికి చెందిన ప్రియాంశ్ అనే ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన బోరు బావిలో పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారిని బయటకు తీసే ప్రయత్నాలు జరగుతున్నాయి. అందుకోసం బోరుబావికి సమాంతరంగా గుంత తొవ్వుతున్నారు. బాలుడు 10 నుంచి 15 ఫీట్ల లోతులో చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా అధికారులతో పాటు పోలీస్, వైద్య సిబ్బంది ఘటనాస్థలంలోనే ఉండి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పైప్ ద్వారా బోరుబావులోకి ఆక్సిజన్ పంపుతున్నారు.
ఉమైరా జిల్లాలో గురువారం మూడేళ్ల బాలుడు 200 ఫీట్ల లోతు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 16 గంటల పాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసినా ఫలితం లేకుండాపోయింది. ఆలస్యం కావడంతో బాలుడు మృతిచెందాడు.
Madhya Pradesh | Seven-year-old boy fell in a borewell in Damoh district
— ANI (@ANI) February 27, 2022
It is estimated that the child is trapped at a depth of about 15 to 20 feet. The rescue team has reached the spot and every effort is being made to get the child out safely: SDM Abhishek Thakur pic.twitter.com/jeTyvQKpEB