
పట్టపగలు.. పొద్దుపొద్దునే హైదరాబాద్ సిటీలోని ఫిల్మ్ నగర్ ఏరియాలో అత్యంత విషాధం. ఇంటి నుంచి స్కూల్ కు బయలుదేరిన చిన్నారిని లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ చిన్నారి పైనుంచి లారీ వెళ్లింది.. అంతే.. నడిరోడ్డుపైన.. ఆ చిన్నారి శరీరం రెండు ముక్కలు అయ్యింది. అత్యంత విషాధకరమే కాదు.. ఒళ్లు జలదరించింది స్థానికులు.. ఈ ఘటన తర్వాత.. యాక్సిడెంట్ జరిగిన తీరును చూసిన స్థానికులు.. రోడ్డున వెళ్లే వారు.. లారీ డ్రైవర్ కింద పడేసి చితక్కొట్టారు. అసలు పగలు 6 గంటలు దాటితే లారీలకు సిటీలో అనుమతి లేదు.. అలాంటిది 9 గంటల సమయంలో ఓ లారీ.. నడిరోడ్డుపై.. రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్నారిని ఢీకొట్టి తీరు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుంది.
హైదరాబాద్ ఫిలింనగర్ షేక్ పేటలో జనవరి 28న ఉదయం లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదో తరగతి విద్యార్థిని గడ్డం అథర్విని అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి కూతురిని బైక్ పై స్కూల్ కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ టేక్ చేయబోయి లారీ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో పాప బైక్ పై నుంచి లారీ కింద పడిపోయింది. మృతదేహాన్ని ఉస్మానియా తరలించారు. లారీ డ్రైవర్ పై స్థానికులు దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫిలింనగర్ పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటలలోపే హెవీ వెహికల్స్ కు అనుమతి ఉంది. కానీ కొన్ని లారీలు,బస్సులు రూల్స్ ను ఉల్లంఘించి నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో భారీ వాహనాలను అనుమతించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఫైర్ అవుతున్నారు.