
కాగజ్ నగర్, వెలుగు : వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి ఏడేండ్ల కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. లైజనింగ్ ఆఫీసర్ కె.సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధి రాంనగర్‌కు చెందిన ఆడె మహేశ్తన భార్య సూర ఎల్లక్కను అదనపు కట్నం తేవాలంటూ వేధించేవాడు. దీంతో ఆమె 2019లో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పటి ఎస్ఐ మధుకర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం సాక్షాధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం కేసును పరిశీలించిన సెషన్స్‌కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ నిందితుడు మహేశ్‌కు ఏడేండ్ల కఠిన జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ సురేశ్ కుమార్ అభినందించారు.