
ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృష్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం కనిపించకుండా పోగా ఆచిన్నారి మేనత్త లేటుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీప్తిశ్రీ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆమె తండ్రి శాంత కుమారి అనే మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. దీంతో ఆ చిన్నారి వాళ్ల మేనత్త దగ్గర ఉంటుంది. పలు సార్లు సవతి తల్లి దీప్తిని కొట్టడంతో పాటు హింసించేదని పోలీసులకు తెలిపారు ఆ చిన్నారి నానమ్మ సూరాడ బేబి. దీంతో సవతి తల్లి శాంతా కుమారిని పోలీసులు విచారించగా.. తనే దీప్తిని చంపేసి ఉప్పుటేరు చెరువులో పడేసినట్లు చెప్పినట్టు సమాచారం. పోలీసులు ఉప్పుటేరు చెరువులో గజ ఈతగాళ్ల సహాయంతో గాలిస్తున్నారు.