కొండ పోచమ్మ రిజర్వాయర్ లో మునిగి.. ఐదుగురు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  మర్కుల్ మండలంలోని  కొండపోచమ్మ రిజర్వాయర్లో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు.  ఏడుగురు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు డ్యామ్ లో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు,గజ ఈతగాళ్ళు డ్యామ్ లో  గాలించి ఇద్దరిని సురక్షితంగా రక్షించారు. ఐదుగురు మృతి చెందారు.

Also Read :- పంతంగి టోల్ గేట్ వరకు 5 కి.మీ ట్రాఫిక్ జామ్

 గల్లంతైన వాళ్లంతా  హైదరాబాద్ ముషిరాబాద్ వాసులుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మర్కుక్  పోలీసులు.

మృతులు

1 ధనుష్ (20) 
2 లోహిత్(17) 
3  ధనేశ్వర్(17)
4 సాహిల్(19) 
5 జతిన్ (17) 

వీళ్లు సేఫ్

కోమరి మృగంక్ (17) 
ఎండి ఇబ్రహీం (17)