జగిత్యాల జిల్లాలో..వడదెబ్బతో స్టూడెంట్‌‌‌‌ మృతి

కొడిమ్యాల, వెలుగు : వడదెబ్బతో ఏడో తరగతి చదువుతున్న స్టూడెంట్ చనిపోయాడు.  కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన కోలకాని అక్షయ్ (13) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌‌‌‌లో 7వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం గుడ్‌‌‌‌ఫ్రైడే సందర్భంగా హాలీడే కావడంతో ఎండలో ఆడుకున్నాడు.

సాయంత్రం నుంచి జ్వరం రాగా శనివారం ఉదయం కుటుంబ సభ్యులు జగిత్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చారు. అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. సాయంత్రం జ్వరం తీవ్రత పెరగడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో మళ్లీ హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయాడు.