రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరికలు

నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మునుగోడు మండలం కోతులారం, లక్ష్మీదేవి గూడెం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ క్యాంప్ ఆఫీసులో ఆయన వారందరికీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. 

మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఆయన భార్య కోమటి లక్ష్మీ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఆమె ఇవాళ ఇంటింటి ప్రచారం చేపట్టారు. దామెర భీమన్న గ్రామస్థులు కోమటిరెడ్డి లక్ష్మికి ఘన స్వాగతం పలికారు. మునుగోడు అభివృద్ధఇ కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు.