తెలంగాణలో పలువురు పలువురు ఐఏఎస్‌‌‌‌ల బదిలీ

తెలంగాణలో పలువురు పలువురు ఐఏఎస్‌‌‌‌ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: పలువురు ఐఏఎస్‌‌‌‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం సెక్రటరీ వి.శేషాద్రికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎం కార్యదర్శి, ఎస్సీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెక్రటరీ రాహుల్‌‌‌‌ బొజ్జాకు రిజిస్ట్రేషన్‌‌‌‌, స్టాంపుల కమిషనర్‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం సీఎస్‌‌‌‌ సోమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో అడిషనల్ సీఈఓగా ఉన్న జ్యోతి బుద్ధప్రకాశ్‌‌‌‌ను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‎టైల్ శాఖ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సెక్రటరీగా, ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కమిషనర్ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న వాకాటి కరుణకు విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. హెల్త్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజ రిజ్వీకి డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. టూరిజం, యూత్ సర్వీసెస్ శాఖను సందీప్ కుమార్ సుల్తానియాకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.