ఒడిశా కటక్ లోని బరంబాలోని సింఘనాథ్ ఆలయంలో మకరమేళా రద్దీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు డాక్టర్ రంజన్ కుమార్ బారిక్.
మకరమేళా సందర్భంగా బదాంబ గోపీనాథ్ పూర్ టీ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటంతో తొక్కసిలాట జరిగింది. ఈ ఘటనలో 45 ఏండ్ల అంజనా స్వైన్ అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.