తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం కళ్యాణి డ్యామ్ సమీపంలో రెండు ఆర్‌టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బస్సు తిరుపతి నుంచి పీలేరు వెళ్తుండగా.. మరో బస్సు మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తోంది. ఈ ఘటనలో ఒక బస్సు డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు.
ALSO READ | జోరుగా కోడి పందేలు.. గెలిచినోళ్లకు రూ. 20 లక్షల థార్ కారు బహుమతి
ప్రధాన రోడ్డుపై ప్రమాదం జరగడంతో.. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇతర వాహనదారులు రెండు బస్సుల్లోని ప్రయాణికులను కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగ్రాతులను రుయా ఆస్పత్రికి తరలించారు.