యాదాద్రి భువనగిరి : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కమలదళంలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారందరినీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
ఇదిలా ఉంటే పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. ర్యాలీలు, సభలతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి వివిధ సంఘాల నాయకులతో సమావేశమై రాజగోపాల్కు మద్దతు కూడగడుతున్నారు.