మునుగోడు బైపోల్: వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరికలు

మునుగోడు బైపోల్:  వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరికలు

మునుగోడుకు వెళ్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కారును మార్గమధ్యలో పోలీసులు తనిఖీ చేశారు.  పోలీసుల చెకింగ్ అనంతరం... వివేక్ వెంకటస్వామి పోలీసులతో ముచ్చటించారు. సరైన సమయానికి వేతనాలు వస్తున్నాయా లేదా అని  పోలీసులను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను వివేక్ వెంకటస్వామి నవ్వుతూ గుర్తు చేశారు.

మునుగోడులోని రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. స్టీరింగ్ కమీటీ చెర్మన్ వివేక్ వెంకటస్వామి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  మునుగోడు ఉపఎన్నికకు  నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలుకు  అక్టోబర్ 14వ  చివరి తేది. నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్ 15ని గడువుగా వెల్లడించారు.