అశ్వారావుపేట/పెనుబల్లి/పాల్వంచ, వెలుగు: వాహనదారులు, పాదచారులు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పలువురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సూచించారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అశ్వారావుపేట ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ లో ఎంవీఐ మనోహర్, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఎంవీఐ రాజశేఖర్, పాల్వంచ పట్టణంలోని ఆటో ట్రాలీ యూనియన్ అడ్డా వద్ద ఎంవీఐ భీమ్‌సింగ్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, డ్రైవింగ్‌లో సెల్ ఫోన్ మాట్లాడొద్దని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు.