తాత్కాలిక గుడిసెల తొలగింపు

తాత్కాలిక గుడిసెల తొలగింపు

చెన్నూరు, వెలుగు : చెన్నూరు మండలంలోని బావురావుపేట సమీపంలో పేదలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలను గురువారం పలువురు వ్యక్తులు తొలగించారు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి గుడిసెలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. నిరుపేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎంనాయకులు బ్రహ్మయ్య, కావిరి రవి, అనిల్, సమ్మక్క, ఉమారాణి, రేణుక, రాజేశ్వరి, భూదేవి, సరిత, రాజేశ్వరి పాల్గొన్నారు.