Ratan Tata dies: రతన్ టాటాకు భారత క్రికెటర్లు నివాళులు

Ratan Tata dies: రతన్ టాటాకు భారత క్రికెటర్లు నివాళులు

పారిశ్రామిక దిగ్గజం, అత్యున్నత వ్యక్తిత్వం గల మానవతావాది రతన్ టాటా కన్ను మూశారు. ఇటీవల బీపీ లెవెల్స్ పడిపోవటంతో హాస్పిటల్ లో చేరిన టాటా బుధవారం ( అక్టోబర్ 10, 2024 ) ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దేశమంతా దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయింది. టీమిండియా క్రికెటర్లు రతన్ టాటాకు నివాళులు అర్పించారు.

దిగ్గజ క్రికెటర్  సచిన్ టెండూల్కర్ తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఆయన మరణానికి విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో "మీరు ఎప్పటికీ మా హృదయాలలో ఉంటారు" రెస్ట్ ఇన్ పీస్ అని తెలిపాడు. 

ALSO READ | ఆయన ఒక లెజెండ్.. భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు: రతన్‌ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు

సచిన్ టెండూల్కర్ తన చివరి నివాళులు అర్పించడానికి కోల్బాలోని రతన్ టాటా నివాసానికి వెళ్ళాడు. "రతన్ టాటా మరణంతో దేశం కదిలిపోయింది. అతనితో సమయం గడపడం నా అదృష్టం. మీరు నిర్మించిన సంస్థలు మరియు మీరు స్వీకరించిన విలువల ద్వారా మీ వారసత్వం కొనసాగుతుంది".అని సచిన్ తన ఎక్స్ లో తెలిపాడు. "మీది గోల్డెన్ హార్ట్. మీ వ్యక్తిత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది". అని రోహిత్ తన సంతాపాన్ని తెలిపాడు.  

"మీది గోల్డెన్ హార్ట్. మీ వ్యక్తిత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది". అని రోహిత్ తన సంతాపాన్ని తెలిపాడు    బంగారు హృదయం ఉన్న వ్యక్తి. సార్, ప్రతి ఒక్కరినీ మంచిగా మార్చడానికి తన జీవితాన్ని నిజంగా పట్టించుకునే మరియు జీవించిన వ్యక్తిగా మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు" అని రోహిత్ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.