హైదరాబాద్: వేసవి రద్దీ నేపథ్యంలో తిరుపతికి 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి నుంచి ఇతర నగరాలకు 5, ఇతర నగరాల నుంచి తిరుపతికి 5 చొప్పున ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. కాచిగూడ నుంచి తిరుపతి (07297), సికింద్రాబాద్ నుంచి తిరుపతి(07438), కాకినాడ నుంచి తిరుపతి (07571), నాందేడ్ నుంచి తిరుపతి (07582), సికింద్రాబాద్ నుంచి తిరుపతి (07584) రైళ్లను నడుపుతామని పేర్కొంది. అలాగే తిరుపతి నుంచి కాచిగూడ(07298), తిరుపతి నుంచి సికింద్రాబాద్(07437), తిరుపతి నుంచి కాకినాడ (07576), తిరుపతి నుంచి సికింద్రాబాద్ (07583), తిరుపతి నుంచి సికింద్రాబాద్ (07585) రైళ్లను నడుపుతామని వెల్లడించింది.
✓ వేసవి రద్దీ నేపథ్యంలో తిరుపతికి 10 ప్రత్యేక రైళ్లు నడపనున్న @SCRailwayIndia
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 13, 2022
✓ తిరుపతి నుంచి ఇతర నగరాలకు 5, ఇతర నగరాల నుంచి తిరుపతికి 5 చొప్పున ప్రత్యేక రైళ్లు
✓ కాచిగూడ నుంచి తిరుపతి(07297),
✓ సికింద్రాబాద్ నుంచి తిరుపతి(07438),
✓ తిరుపతి నుంచి కాచిగూడ(07298), 1/2
మరిన్ని వార్తల కోసం: