నెట్వర్క్, ఆదిలాబాద్, వెలుగు: బదిలీపై వచ్చిన పలువురు తహసీల్దార్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల నుంచి జన్నారానికి ట్రాన్స్ఫర్అయిన ఎంఆర్వో రాజమనోహర్ రెడ్డితోపాటు ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎంపీడీఓగా వచ్చిన శశికళ బాద్యతలు చేపట్టారు.
లక్ష్మణచాంద తహసీల్దార్ గా జానకి, ఎంపీడీఓ గా రాంప్రసాద్, మామడ మండల తహసీల్దార్ గా సుధాకర్, ఎంపీడీఓగా సుశీల్ రెడ్డి భీమారం మండల తహసీల్దారుగా ఎం.సదానందం బాధ్యతలు చేపట్టారు.