Good Health : నడుం నొప్పిని ఇలా వదిలించుకోండి.. వంటింటి చిట్కాలతో..!

Good Health : నడుం నొప్పిని ఇలా వదిలించుకోండి.. వంటింటి చిట్కాలతో..!

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల... నలుగురిలో ఇద్దరు కచ్చితంగా నడుం లేదా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పికి వయసుతో పని లేదు. అయితే నొప్పి కొద్దిగా ఉన్నప్పుడే... ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటికి కూడా మందులపై ఆధారపడకుండా... ఇంట్లోనే సైడ్ ఎఫెక్ట్స్ లేని కొన్ని చిట్కాలతో నొప్పిని నివారించొచ్చు. అలాకాకుండా నొప్పి తీవ్రమైనప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి.

వెల్లుల్లి :  వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్ధం వెన్ను నొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అందుకే వెల్లుల్లి పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయాన్నే రెండు లేదా. మూడు వెల్లుల్లి దెబ్బలను తినడం వల్ల నొప్పి తగ్గుతుంది. పచ్చిగా తినలేని వాళ్లు వంటల్లో వేసుకుని తినొచ్చు.
అల్లం : అల్లం వంటింట్లో ఉండే బెస్ట్ మెడిసిన్ . ఇది కూడా వెన్నునొప్పి ఉపశమనానికి సాయపడుతుంది. రోజూ చేసుకునే వంటల్లో కచ్చితంగా అల్లం ఉండేలా చూసుకోవాలి. అలా కుదరనప్పుడు ప్రతిరోజూ ఒకసారి అల్లం టీ తాగినా సరిపోతుంది.

 కొబ్బరి నూనె : ముడి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్ మేటరీ, అనాల్జెసిక్, యాంటీ పైరేటి లక్షణాలు ఉంటాయి. కొబ్బరి నూనె అన్ని రకాల వెన్ను నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి తక్షణ ఉపశమనం కోసం కొబ్బరి నూనెను అప్లై చేయాలి. పావు చెంచా కొబ్బరి నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో వేసి పది నిమిషాలు మర్దనా చేయాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు కలిపిన పాలు: వంటింట్లో అద్భుతమైన ఆరోగ్య లక్షణాలున్న పసుపు కూడా నడుం నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే కుర్ క్యుమిన్ అనే పదార్థం ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో సాయపడుతుంది. అదే విధంగా పాలలోని క్యాల్షియం, విటమిన్- డి. ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. రాత్రిళ్లు నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.

ఆలివ్ ఆయిల్: ముడి ఆలివ్ ఆయిల్లో నొప్పి ఉపశమనానికి సాయపడే ఓబియోకాంతల్ అనే పదార్ధం ఉంది. ఇది కూడా పెయిన్ కిల్లర్ గా పని చేస్తుంది. నొప్పిగా ఉన్న ప్రాంతంలో పావు చెంచా ఆలివ్ ఆయిల్ వేసి, పది నిమిషాలు మర్దనా చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నొప్పి మెల్లిమెల్లిగా తగ్గుతుంది.
యోగా: యోగా శరీరానికి బలాన్ని అందిస్తూ... ఎప్పుడూ ఫిట్ గా ఉండేలా చేస్తోంది. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి బాగా ఉపయోగపడుతుంది.
యోగాసనాల్లో వెన్నునొప్పికి కొన్ని ప్రత్యేక భంగిమలు ఉంటాయి. వాటిని రెగ్యులర్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
డాక్టర్ చికిత్స: వెన్నునొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు శరీరం కుంగిపోతుంది. అలాంటప్పుడు కచ్చితంగా డాక్టర్ వి సంప్రదించాలి. అంతేకాదు, ఇంటి చికిత్సలకు నొప్పి తగ్గినప్పుడు, చేతులు, కాళ్లు తిమ్మిరెక్కడం లేదా మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి.

హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్

వెన్ను టెణికినప్పుడు లేదా నొప్పిగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ని పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కోల్డ్ కంప్రెస్ వెన్నునొప్పికి ఒక నంబింగ్ ఎఫెక్ట్ (స్పర్శలేకుండా) అందిస్తుంది. అలాగే హీటింగ్ ప్యాడ్ లేదా వేడినీళ్లు వంటి హాట్ కంప్రెస్ గట్టిపడిన లేదా బిగుసుకున్న కండరాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. ఐస్ లేదా హాట్ ప్యాక్ ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు అప్లై చేయొద్దు. అలాగే నొప్పిని బట్టి రోజులో సాధ్యమైనన్నిసార్లు వేడి లేదా కోల్ కంప్రెస్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుంది.