PahalgamTerroristAttack: టూరిస్టులపై ఉగ్రదాడి పిరికిపంద చర్య.. తీవ్రంగా ఖండించిన సీనీ ప్రముఖులు..

PahalgamTerroristAttack: టూరిస్టులపై ఉగ్రదాడి పిరికిపంద చర్య.. తీవ్రంగా ఖండించిన సీనీ ప్రముఖులు..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అందరినీ కలిచివేసింది. మంగళవారం (2025 ఏప్రిల్ 22న) అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కపడింది. ఉగ్ర ముష్కరుల బుల్లెట్లకు 26 మంది అమాయకపు టూరిస్టులు బలయ్యారు. ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఈ సంఘటనపై వారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధితులకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. 

అల్లు అర్జున్ Xలో స్పందిస్తూ.. "పహల్గామ్ దాడితో హృదయం విరిగిపోయింది. దయగల వ్యక్తులతో కూడిన అందమైన ప్రదేశం ఇది. అలాంటి చోట ఈ ఉగ్రదాడి జరగడం నన్ను బాధిస్తుంది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. వారి అమాయక ఆత్మలు శాంతించాలి. నిజంగా హృదయ విదారకంగా ఉంది" అని అల్లు అర్జున్ ఎమోషన్ అయ్యాడు. 

జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేస్తూ X లో పోస్ట్ పెట్టాడు. "పహల్గామ్ దాడి బాధితులకు జరిగిన అన్యాయం తెలిసి హృదయం ద్రవించిపోయింది. నా ఆలోచనలు వారి కుటుంబాలతో ఉన్నాయి. వారికి శాంతి కలగాలని, న్యాయం లభించాలని ప్రార్థిస్తున్నాను" అని ఎన్టీఆర్ అన్నారు.

సోను సూద్ స్పందిస్తూ.. "కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నాగరిక ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. ఈ దుర్మార్గపు చర్య ఆమోదయోగ్యం కాదు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం సాయి రామ్" అని సోను సూద్ విచారం వ్యక్తం చేశారు. 

ఈ దారుణ ఘటనపై నటుడు సంజయ్ దత్ ఆగ్రహం వ్యక్తం చేశారు."వారు మన ప్రజలను దారుణంగా చంపారు. దీనిని క్షమించలేము. ఈ ఉగ్రవాదులు మనం మౌనంగా ఉండటం లేదని తెలుసుకోవాలి. మనం ప్రతీకారం తీర్చుకోవాలి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మరియు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ లను వారికి అర్హమైనది ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను" అని సంజయ్ దత్ X లో పోస్ట్ పెట్టాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ  Xలో పోస్ట్ పెట్టాడు. “పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి గురించి తెలిసి భయానకంగా ఉంది. ఇలాంటి అమాయకులను చంపడం చాలా దారుణం. వారి కుటుంబాల కోసం ప్రార్థనలు”. అన్నాడు. 

కమల్ హాసన్ X లో స్పందిస్తూ.. " పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్న. గాయపడిన వారికి బలం మరియు కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.  

హీరో మోహన్ లాల్ ట్వీట్ చేస్తూ.. "పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు జరిగిన అన్యాయంతో నా హృదయం విలపిస్తుంది.ఇంత క్రూరత్వాన్ని చూడటం చాలా బాధాకరం. అమాయకుల ప్రాణాలను బలిగొనడాన్ని ఏ కారణం కూడా సమర్థించదు.దుఃఖిస్తున్న కుటుంబాలకు, మీ దుఃఖం మాటల్లో చెప్పలేనిది. మీరు ఒంటరిగా లేరని దయచేసి తెలుసుకోండి. మొత్తం దేశం దుఃఖంలో మీతో నిలుస్తుంది. మనం ఒకరినొకరు కొంచెం గట్టిగా పట్టుకుని, చీకటిలో కూడా శాంతి నెలకొంటుందనే ఆశను ఎప్పటికీ వదులుకోకుండా ఉందాం" అని నాట్ రాశాడు. భారతదేశం ఐక్యంగా ఉంది - దుఃఖంలో, సంకల్పంలో మరియు చట్టం, ఆర్డర్ మరియు జాతీయ భద్రతను కాపాడటానికి మా నిబద్ధతలో.

టూరిస్ట్ స్పాట్ బైసారన్ లో టెర్రిరిస్టుల మారణహోమనికి 26 మంది బలయ్యారు. బైసారన్ లోయలోని పర్వతం నుండి దిగి వచ్చిన ఉగ్రవాదులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బైసారన్ లోయలోని పర్వతం నుండి దిగి వచ్చి, పొడవైన, పచ్చని పచ్చిక బయళ్ల కారణంగా 'మినీ స్విట్జర్లాండ్' అని పిలువబడే ఈ ప్రదేశానికి తరచుగా వచ్చే పర్యాటకులపై కాల్పులు జరపడం దర్సదృష్టకరం.