పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బీర్‌భూమ్ జిల్లాలోని ఓ బొగ్గు గని భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు అందించడానికి బయలుదేరారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బీర్‌భూమ్‌లోని లోక్‌పూర్ ప్రాంతంలో ఉన్న గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ కొలీరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ప్రభావానికి సమీపంలో పార్క్ చేసిన వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొలీరీలో బొగ్గు వెలికితీత కోసం పేలుడు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. గనిలో పేలుడు తర్వాత అధికారులు, కార్మికులు సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు.
West Bengal: In Birbhum, Khoyrasol, a blast at the Gangaramchak coal mine has resulted in the deaths of 7 workers. Initially, 5 bodies were recovered from inside the mine, followed by reports of two additional fatalities. There are concerns that other individuals may be trapped… pic.twitter.com/BK61w6M4iI
— IANS (@ians_india) October 7, 2024
ALSO READ | రాజకీయం చేయకండి.. ఓవర్ హీట్ కారణంగా చనిపోయారు : మంత్రి మా సుబ్రమణియన్