
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ తుపాన్కుదిపేస్తున్నది. ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీయడంతో ఓ పర్యాటక ప్రాంతంలో చెట్టు కూలగా.. ఆరుగురికిపైగా మృతిచెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మణికరణ్ గురుద్వారా ముందు రోడ్డు సమీపంలో ఉన్న చెట్టు తుపాన్ కారణంగా దుకాణాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద చెట్టు కూలడంతో దానికింద దుకాణాలు, కార్లు నుజ్జునుజ్జయిపోయాయి. ‘మా అమ్మ, వాళ్లు చనిపోయారు’ అంటూ ఓ వ్యక్తి ఏడుస్తూ చెప్పడం అందరినీ కలిచివేసింది. కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా, కాంగ్రా, కుల్లు, మండి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.