ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..

గుడివాడలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హనుమాన్ జంక్షన్ నుండి గుడివాడ వెళ్లే మార్గంలో మీర్జాపురం సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడ్డ సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నిజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.ఘటనాస్థలి వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.