- ఆపరేషన్ చేసి తొలగించిన జనగామ డాక్టర్లు
జనగామ అర్బన్, వెలుగు: ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రి వెళ్లగా.. కడుపులో పెద్ద కణితిని ఉన్నట్టు డాక్టర్లు గుర్తించి ఆపరేషన్‌చేసి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ఇటుకల తబిత(47) కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది.
రెండువారాల కింద జనగామ జిల్లా కేంద్రంలోని రవళి నర్సింగ్‌హోమ్ కు వెళ్లింది. పేషెంట్‌ను డాక్టర్రాజమౌళి పరీక్షించి టెస్ట్ లు చేసి కడుపులో కణితి ఉందని నిర్ధారించారు. మంగళవారం ఆపరేషన్‌చేసి ఆమె కడుపులోని 5 కిలోల 100 గ్రాములు కణితిని తొలగించారు. ఆపరేషన్ విజయవంతగా చేసినట్టు ఆస్పత్రి డాక్టర్రాజమౌళి, అనస్తీషియా డాక్టర్రఘు తెలిపారు.